విజయకీలాద్రిపై తొలి ఏకాదశి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

విజయకీలాద్రిపై తొలి ఏకాదశి వేడుకలు

Jul 26 2026 2:02 AM | Updated on Jul 26 2026 2:02 AM

విజయకీలాద్రిపై తొలి ఏకాదశి వేడుకలు తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి వారి మంగళ శాసనాలతో ఉదయం 9 గంటలకు వేంకటేశ్వరస్వామికి అభిషేక మహోత్సవం, 10 గంటలకు తులసీ దళాలతో సహస్రనామార్చన, గోపూజ, అనంతరం తీర్థప్రసాద దోష్టి కార్యక్రమాలు వైభవంగా జరిగాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. 29న కోటప్పకొండలో అక్షరాభ్యాసం ఉండవల్లి గుహల్లో తెలుగు మహోత్సవం

నరసరావుపేట రూరల్‌: గురుపౌర్ణమి సందర్భంగా ఈనెల 29వ తేదీ ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో మేధాదక్షిణామూర్తి హోమం, గిరి ప్రదక్షిణ, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు శనివారం తెలిపారు. ఆలయ అవరణలో నిర్వహించే అక్షరాభ్యాసం, ఇతర కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు.

తాడేపల్లిరూరల్‌ : ఉండవల్లి గుహల వద్ద రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం తెలుగు మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు, సంస్కృత అకాడమి చైర్మన్‌ ఆర్‌.డి.విల్సన్‌ మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఎన్‌టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశా, సాంస్కృతిక శాఖ అధ్యక్షులు తేజస్వి, ఎడిమల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షులు గజల్‌ శ్రీనివాస్‌, డీసీపీ సరిత, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ గద్దె అనూరాధ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement