నగరంపాలెం: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, సమర్థవంతమైన పోలీసింగ్, పరిపాలనలో ఇద్దరు పోలీస్ అధికారులు అందించిన సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఏఆర్ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది కర్నూలు జిల్లాకు బదిలీపై వెళ్తున్న హనుమంతు, ప్రస్తుతం రేపల్లె డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న షేక్.అజీజ్‌ను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్‌లో సత్కరించి, జ్ఙాపికలు అందించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వకుల్ జిందాల్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించారని అన్నారు. తద్వారా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు. సామాజిక సేవలో హనుమంతు ముందుంజలో ఉన్నారని అన్నారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అలహరి శ్రీనివాస్ (ఎస్‌బీ), శ్రీనివాస్‌రెడ్డి (మహిళా పీఎస్), శివాజీ (సీసీఎస్), ఆర్‌ఐ శ్రీహరిరెడ్డి, సురేష్‌బాబు, కృష్ణయ్య, ఆర్‌ఎస్‌ఐలు, సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


