గెలుపోటముల కన్నా క్రీడాస్ఫూర్తి ముఖ్యం
గుంటూరు రూరల్: గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆర్‌వీఆర్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జె.మురళీమోహన్, డాక్టర్ జగదీష్ పేర్కొన్నారు. చౌడవరంలోని కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల సాఫ్ట్‌బాల్ పురుషుల టోర్నమెంట్ శుక్రవారంతో ముగిసింది. ఉత్కంఠంగా సాగిన ఈ టోర్నమెంట్‌లో సి.ఆర్. డిగ్రీ కాలేజీ (చిలకలూరిపేట) జట్టు విజేతగా నిలిచింది. కె.హెచ్. అండ్ ఎల్.ఎస్. స్కాలర్స్ డిగ్రీ కాలేజీ (పిడుగురాళ్ల) జట్టు రన్నరప్ ట్రోఫీని అందుకుంది. తృతీయ స్థానంలో ఆర్.వి.ఆర్.జె.సి.ఇంజినీరింగ్ కళాశాల, నాలుగో స్థానంలో వాగ్దేవి డిగ్రీ కాలేజీ (నరసరావుపేట) జట్లు నిలిచాయి. మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులతో ఏఎన్‌యూ సాఫ్ట్‌బాల్ జట్టును సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్.గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె.కృష్ణప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస్, డైరెక్టర్ డాక్టర్ కె.రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, పీడీలు డాక్టర్ పీ గౌరీశంకర్, డాక్టర్ ఎం.శివరామకృష్ణ, ఏఎన్‌యూ టోర్నమెంట్ అబ్జర్వర్ డాక్టర్ సూర్యనారాయణ, సెలెక్షన్ కమిటీ మెంబర్స్ డాక్టర్ ప్రీతంప్రకాష్, డాక్టర్ బుచ్చిబాబు, డాక్టర్ పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌వీఆర్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాల ప్రతినిధులు
ముగిసిన అంతర్ కళాశాలల
సాఫ్ట్‌బాల్ టోర్నీ


