నేటి నుంచి అప్రెంటిస్‌షిప్‌నకు ధ్రువపత్రాల పరిశీలన
పట్నంబజారు: ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ చేసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఐటీఐ అభ్యర్థుల విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలన తేదీలు ఖరారు చేసినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం సాబ్రాంజ్యం తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సిన అభ్యర్థుల వివరాలను ట్రేడ్‌ల వారీగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్‌ఆర్టీసీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 24, 26, 29వ తేదీల్లో విజయవాడలోని విద్యాధరపురంలో ఉన్న ఆర్టీసీ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. 24న మోటారు మెకానిక్, ఫిట్టర్, సివిల్, వెల్డర్, పెయింటర్, 26, 27న ఎలక్ట్రీషియన్, 29, 30న డీజిల్ మెకానిక్ అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు.
30న ‘చలో విజయవాడ’
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 30న చేపట్టిన హలో యువత.. చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్.వలి పిలుపునిచ్చారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో విజయవాడ నిరుద్యోగ రణభేరి పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. వలి మాట్లాడుతూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.


