లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వ
మంగళగిరి టౌన్ : మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతనంగా నియమితులైన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. దేవస్థాన ప్రాంగణంలో ఈఓ సునీల్ కుమార్ సమక్షంలో ధర్మకర్తల మండలి సభ్యులు దామర్ల నాగలక్ష్మీ, మల్లాది వేదవతి, బళ్ళ ఉమా మహేశ్వరరావు, భీమవరపు శేషి రెడ్డి, మాజేటి కృష్ణ కుమారి, మేకల మోహనరావు, పేరం లీలావతి, కొక్కెరపాటి పూర్ణచంద్రరావు, గురప్రుశాల శ్రీలక్ష్మీ, చెల్లూరి వీర వెంకట సత్యనారాయణ, తుల్లిమిల్లి రామకృష్ణ, రుద్రుడు త్రిశూల ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం నూతన పాలకమండలి సభ్యులు సాంప్రదాయబద్ధంగా స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలకమండలి సభ్యులు చురుకుగా పాల్గొని భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఈవో కోగంటి సునీల్ కుమార్ కోరారు. కార్యక్రమంలో ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఆలయ అధికారులు, వేదపండితులు, ధర్మకర్తల కుటుంబసభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


