వైభవంగా వసంత పంచమి
నరసరావుపేట ఈస్ట్: వసంత పంచమిని పురస్కరించుకొని భక్తులు ఆలయాల లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘ శుద్ధ పంచమి రోజున శ్రీసరస్వతీ దేవి జన్మదినం సంద ర్భంగా శుక్రవారం తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరా భ్యా సం నిర్వహించారు. నరసరావుపేటలోని శ్రీశృంగేరీ శంకరమఠంలోని శ్రీశారదాంబ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పెన్నుల తో అలంకరించి పూజలు జరిపారు. వినుకొండరోడ్డులోని త్రిశక్తి దేవాలయల సముదాయంలోని శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ఆలయాలతో పాటు పాఠశాలల్లో సరస్వతీ పూజలు నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాసం జరిపారు.
రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి 176వ వార్షిక మహోత్సవంలో భాగంగా ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నవదిన ప్రార్థనలు జరుగుతాయని విచారణ గురువులు ఏరువ లూర్ధుమర్రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు జెండా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. అనంతరం చర్చి ప్రాంగణంలో సిల్వర్ జూబిలేరియన్స్ రెవ.ఫాదర్ పుట్టి అంతోనిరాజు, రెవ.ఫాదర్ తుమ్మా మర్రెడ్డి, రెవ.ఫాదర్ చింతపల్లి అబ్రహాం, రెవ.ఫాదర్ పోతిరెడ్డి ఇన్నారెడ్డిలచే దివ్యపూజాబలితో పండుగ మహోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
తెనాలి:ఆంధ్రవాల్మీకి శ్రీవాసుదాస స్వామి వా రి పరంపరపీఠం దాసకుటి, అంగలకుదురులో పీఠాధిపతి శ్రీ సీతారామదాసస్వామి వారి ఆధ్వర్యంలో 164వ శ్రీ వాసుదాసు స్వామి జయంతిని ఘనంగా జరుపుతున్నారు. మూడు రోజుల వేడుకల్లో రెండవ రోజైన శుక్రవారం రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. జాగర్లమూడి రఘురాం ఆచార్యులు పూజా కార్యక్రమాలను చేయించారు. ప్రవచనకర్త ములుకుట్ల విశ్వనాథశాస్త్రి శ్రీ సత్యనారాయణ స్వామివ్రత కథను వివరించారు. ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి దంపతులు, పులిపాక అప్పారావు దంపతులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.
తెనాలి: ఈనెల 25వ తేదీన రథసప్తమిని పురస్కరించుకుని తెనాలి బాలాజీరావుపేటలోని అయ్యప్ప దేవాలయం నిర్వాహకుడు దుర్భా హరిబాబు స్థానిక వీఎస్సార్ అండ్ ఎన్‌వీఆర్ కళాశాల ప్రాంగణంలో సహస్ర దళ సూర్యయంత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. రథసప్తమికి అందుబాటులోకి వస్తుందని, భక్తులందరూ దర్శించుకోవాలని సూచించారు.
నాదెండ్ల: కనపర్రు గ్రామంలోని పురాత న ఆర్‌సీఎం చర్చిలో పునీత, జోజప్ప కల్యాణ నిశ్చితార్థ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చర్చి నిర్మించి 128 వసంతాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమానికి విచారణ గురువు ఫాదర్ చిన్నాబత్తిని భాగ్యయ్య హాజరయ్యారు. స్థానిక విచారణ గురువు బంధనాథం లూర్దురాజు ఆధ్వర్యంలో ఉదయం సమష్టి దివ్య పూజాబలి నిర్వహించా రు. కానుకలు, కొవ్వొత్తులు సమర్పించారు. రాత్రి తేరు ఊరేగింపు నిర్వహించారు. చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. చర్చి వద్ద ఏర్పాటుచేసిన భారీ విద్యుత్ ప్రభ ఆకట్టుకుంది.
వైభవంగా వసంత పంచమి
వైభవంగా వసంత పంచమి
వైభవంగా వసంత పంచమి
వైభవంగా వసంత పంచమి


