ఐస్ స్కేటింగ్‌లో రజతం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన లడఖ్‌లో ఈ నెల 20న జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్–2026లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన జెస్సీ రాజ్ సీనియర్ గరల్స్ ఫిగర్ స్కేటింగ్ కేటగిరీలో రజత పతకాన్ని గెలుచుకున్నారు. జెస్సీరాజ్ విజయవాడలోని ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్ స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థిని. ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అమితాబ్ శర్మ, సెక్రటరీ జగరాజ్ సింగ్ సహానీ, ఫిగర్ స్కేటింగ్ హెడ్ నటాలి, ఏపీ ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి, సెక్రటరీ ఖాజా, కోచ్ అబ్దుల్ హఫీజ్ వెండి పతకాన్ని సాధించిన జెస్సీరాజ్‌ను అభినందించారు.
తెనాలి: శాలివాహన సంఘం (కుమ్మరి), తెనాలి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల మొదటి శాలివాహన వధూవరుల పరిచయ వేదికను తెనాలిలో నిర్వహించనున్నారు. శాలివాహన సంఘం (కుమ్మరి) నాయకులు గురువారం చెంచుపేటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. ఫిబ్రవరి 22వ తేదీన తెనాలి ఎన్జీవో కల్యాణమండపంలో జరిగే వధూవరుల పరిచయవేదిక, శాలివాహన సంఘం, తెనాలి గౌరవ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, ఆర్గనైజర్ వేజండ్ల శివన్నారాయణ పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం72044 95747, 92472 71344, 70135 01766 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


