ఏపీ గ్రామీణ బ్యాంక్‌తో యూనియన్ ఎంఎఫ్ భాగస్వామ్యం
కొరిటెపాడు(గుంటూరు): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డై–ఇచి లైఫ్ హోల్డింగ్ ఇన్ కార్పొరేషన్ స్పాన్సర్ చేస్తున్న యూనియన్ మ్యూచువల్ ఫండ్(యూనియన్ ఎంఎఫ్), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్(ఏపీజీబీ)తో పంపిణీ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ మేరకు గురువారం గుంటూరులోని ఓ హోటల్‌లో ఏపీజీబీ చైర్మన్ ప్రమోద్‌కుమార్ రెడ్డి, యూనియన్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎంసీ) సీఈఓ మధు నాయర్‌లు ఒప్పందంపై సంతకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎంసీ సీఈఓ మధు నాయర్ మాట్లాడుతూ 2025 డిసెంబర్ 31వ తేదీ నాటికి యూనియన్ మ్యూచువల్ ఫండ్ సుమారు రూ.25,636 కోట్ల సగటు నిర్వహణలో ఉన్న ఆస్తులను నిర్వహిస్తోందని తెలిపారు. ఏపీజీబీ చైర్మన్ కె.ప్రమోద్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 1,351 శాఖలు, సుమారు 1.20 కోట్ల మంది ఖాతాదారులతో రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద బ్యాంక్‌గా ఏపీజీబీ ఉందన్నారు.


