బ్యాంకు ఉద్యోగుల నిరసన ర్యాలీ
కొరిటెపాడు (గుంటూరు వెస్ట్) : బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ల సాధనలో భాగంగా గురువారం గుంటూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలో తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలు వారి డిమాండ్ల సాధనకు ఈనెల 27న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలలో భాగంగా బ్యాంకు యూనియనన్స్ యునైటెడ్ ఫోరం తరఫున దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాలు, జిల్లా కేంద్రాలలో నిర్వహించిన ప్రదర్శనలో బ్యాంకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగంలో వారంలో ఐదు రోజుల పనిని అమలు చేయడానికి ప్రభుత్వ అనుమతి కోరారు. ప్రస్తుతం 2, 4వ శనివారాలు ఇప్పటికే సెలవులుగా ఉన్నాయి. మిగిలిన శనివారాలను కూడా సెలవులుగా ప్రకటించాలని కోరారు. గుంటూరులో యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో గుంటూరు మాడ్యూల్ ఎస్.బి.ఐ. ఆఫీసర్స్ అసోసియేషన్ సీఆర్‌ఎస్ కె.ఆర్.వి.జయకుమార్, ఎస్.బి.ఐ.స్టాఫ్ యూనియన్ డీజీఎస్ కె. కోటిరెడ్డి, ఎ.జి.ఎస్. పి.ఎస్. రంగసాయి, యు.ఎఫ్.బి.యు.అడ్వైజర్ పి.కిషోర్, యు.ఎఫ్.బి.యు. ప్రెసిడెంట్ రవిచంద్రా రెడ్డి, యు.ఎఫ్.బి.యు. జిల్లా కన్వీనర్ మహమ్మద్ సయ్యద్ బాషా, యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ సెక్రటరీలు ఎం. రాంబాబు, పి. కళ్యాణ్, ఎ.పి.టి.బి.ఇ.ఎఫ్. ప్రెసిడెంట్ రామకృష్ణ, బెఫి స్టేట్ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు, ఇతర నాయకులతో పాటు వివిధ శాఖల లోకల్ సెక్రటరీలు, బ్యాంక్ సిబ్బంది పాల్గొని పెద్దఎత్తున తమ నిరస తెలిపారు.


