న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా
ఆ దాడి జరిగినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. ఆ సమయంలో ఎస్‌సై, ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి గేటు కొట్టి ఇంట్లో ఎవరు ఉన్నారని అడిగారు. నేను, పిల్లలు ఉన్నామని చెప్పాను. మీ ఆయన ఎక్కడకు వెళ్లారంటే పొలానికి నీరు పెడుతున్నారని చెప్పాను. సర్పంచ్ నాగేశ్వరరావు ఇంటికి తాళాలు వేసి ఉంది ఎక్కడకు వెళ్లారని అడిగారు. నాకు తెలియదండి అన్నాను. పది నిమిషాల్లో జనాలు వచ్చి రాడ్డులు, కర్రలతో ఇల్లు, సామాన్లు పగులగొట్టి తలుపులు పగులగొడుతుంటంతో పిల్లలను దుప్పట్లో గట్టిగా కప్పి వారిని కాపాడుకున్నాను. నా భర్త పొలం నుంచే ఎటు వెళ్లిపోయాడో తెలియదు.
–తిరుపతమ్మ


