అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లు పరిశీలన
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఫిబ్రవరి 17 నుంచి 27వ తేదీ వరకు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగనున్న ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లను ఆర్మీ రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నల్ రజత్ సువర్ణతో కలసి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ బుధవారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులకు ర్యాలీ నిర్వహిస్తారన్నారు. కల్నల్ రజత్ సువర్ణ మాట్లాడుతూ ఫిబ్రవరిలో 17 నుంచి 27వ తేదీ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు వారి ఈ–మెయిల్‌కు నియామక ఉత్తర్వులు పంపించడం జరుగుతుందన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ డైరెక్టర్ సత్య పాల్, ఆర్మీ మేజర్ అమర్‌దీప్ కుమార్, అదనపు పోలీసు సూపరింటెండెంట్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారిని బుధవారం పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత అమ్మవారి ఆలయానికి వచ్చిన స్వామిజీకి ఆలయ అర్చకులు, కార్యనిర్వాహణాధికారి పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. ముందుగా విద్యా శంకర భారతి మహాస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి పూజలు చేశారు. ఆయన అనుగ్రహణ భాషణం చేశారు. అనంతరం స్వామిజీని ఆలయ కార్య నిర్వాహణాధికారి నరసింహమూర్తి ట్రస్టుబోర్డు చైర్మన్ చక్రధర్‌రెడ్డి సన్మానించి అమ్మవారి శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని అందించి తీర్ధ ప్రసాదాలు ఇచ్చారు.
రైల్వే చీఫ్ జోనల్ మేనేజర్ ఇలా వచ్చి... అలా వెళ్లారు
వినుకొండ: దక్షిణ మధ్య రైల్వే చీఫ్ జోనల్ మేనేజర్ సంజయ్ శ్రీవాత్సవ్ వినుకొండ రైల్వేస్టేషన్ సందర్శన కేవలం ఐదు నిమిషాల్లో ముగిసింది. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో బయలుదేరిన ఆయన నంద్యాల, దొనకొండ మీదుగా వినుకొండ చేరుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ప్రజ ల నుంచి వినతిపత్రం స్వీకరించారు. ఎన్నో సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు ఇచ్చేందుకు వచ్చిన స్థానికులకు ఎక్కువ సమ యం కేటాయించకపోవడంతో నిరాశ మిగిలింది. ముఖ్యంగా నడికుడి–శ్రీకాళహస్తి మార్గంలో గూడ్స్ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయని, 45 పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు వినుకొండ మార్గంలో నడుస్తున్నప్పటికీ ప్యాసింజర్ రైలు లేకపోవ డంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నడికుడి కాళహస్తి డబ్లింగ్ పనులు ఎప్పుడు పూర్తవుతాయని సమస్యలను అడిగేందుకు వచ్చిన ప్రయాణికులకు నిరాశ మిగిలింది. ఆయన వెంటనే గుంటూరు వెళ్లారు.
ఉపాధ్యాయుల డీఏ
బకాయిలు వెంటనే చెల్లించాలి
చిలకలూరిపేట: ఉపాధ్యాయుల డీఏ బకాయి లు జాప్యం లేకుండా వెంటనే చెల్లించాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో సంఘ సమావేశం బుధవారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రూ.1100 కోట్లు విడదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ నేటికీ చాలామంది ఖాతాల్లో మూడు విడతల డీఏ బకాయిలు జమ కాలేదని విమర్శించారు. ఎస్టీయూ నాయకులు పలువురు పాల్గొన్నారు.
అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లు పరిశీలన
అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లు పరిశీలన
అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లు పరిశీలన


