పెట్రోలు పోసుకుని తగలపెట్టుకుంటాం
నరకం అంటే ఏంటో చూపిస్తున్నారు. ఆడవాళ్లమని కూడా చూడడం లేదు. మా మగవారు రెండేళ్లుగా ఊళ్లో లేకుండా వెళ్లిపోయారు. మమ్మల్ని చంపినా దిక్కులేదు. ఎనిమిది మంది పోలీసులు ఉన్నా గడ్డివాము తగలపెడుతున్నా చూస్తుండిపోయారు. వాళ్లు చంపేకన్న, మాకుగా మేము చచ్చిపోయేందుకు అనుమతి కోరాం. మేము యాదవులం. మాకు న్యాయం చేయండి. ఎమ్మెల్యే ఆనందబాబు కొట్టమన్నాడని బెదిరిస్తే మహిళలంతా భయపడిపోయాం. సర్పంచ్ నాగేశ్వరరావును చంపితే వైఎస్సార్‌సీపీ అనేది ఉండదు. అప్పుడు అంతా టీడీపీలోకి వస్తారని వాళ్లు భావిస్తున్నారు. పెద్ద పెద్ద కత్తులు, రాడ్డులు తీసుకువచ్చారు. మగవారు ఎవరు దొరికినా, చంపి అక్కడ పడేసి వెళ్లిపోయేవాళ్లు. మాకు ఏ న్యాయం చేయకపోతే పెట్రోలు పోసుకుని తగలపెట్టుకుంటాం.
– శివకుమారి, బాధితురాలు


