ఇళ్ల మీదకు వచ్చి భయ బ్రాంతులకు గురిచేశారు
గతంలో వినాయకచవితి నిమజ్జనం
సందర్భంగా కూడా సుమారు 50 మంది వచ్చి ట్రాక్టర్‌లో ఉన్న మహిళలు, చిన్నా పెద్ద అని కూడా చూడకుండా మెడలోని గొలుసులు లాక్కొని దాడికి పాల్పడ్డారు. అప్పుడూ పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. మాకు అప్పుడు న్యాయం చేయకపోవడంతోనే ఇప్పుడు ఈ దాడి జరిగింది. మాకు రక్షణ లేదు, కాబట్టి మేం చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరాం. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను గ్రామాల్లో ఉండకుండా చేయాలనుకుని టీడీపీ మూకలు దాడికి యత్నిస్తున్నారు. పోలీసుల అండతో వారి సమక్షంలోనే మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు.
– లక్ష్మి, బాధితురాలు


