గంజాయి ముఠా అరెస్ట్
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయించే ముఠాను గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేసుల వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో టోల్‌ప్లాజా మధురానగర్‌లోని ఓ వెంచర్‌లో మంగళవారం మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ బ్రహ్మం, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తనఖీలు చేశారని అన్నారు. ఈ క్రమంలో పలువుర్ని అదుపులోకి తీసుకుని విచారించారని తెలిపారు. దాసరి వినయ్‌బాబు (మంగళగిరి యర్రబాలెం), కొల్లిమర్ల లోకేష్ (నవులూరు), రామిదేని సాయికృష్ణ (అంబటినగర్), తట్టుకోళ్ల దానియల్‌రాజు అలియాస్ బడాయి (పుల్లయ్యనగర్, కాజ), బండిరెడ్డి నంద్ (తాడేపల్లి), చిరుుబోయిన హరికృష్ణ (కాజ), నల్లగొర్ల సాయితేజ (దుగ్గిరాల), మైనర్ (తాడేపల్లి) స్నేహితులని అన్నారు. వీరంతా గంజాయి, చెడు అలవాట్లకు బానిసయ్యారని చెప్పారు. రామిదేని సాయికృష్ణకు విజయవాడ జైల్లో ఒకరు పరిచయమైనట్లు తెలిపారు. ఈ క్రమంలో ఒడిశాలో డొరా అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తాడని ఫోన్ నంబర్ ఇచ్చాడని పేర్కొన్నారు. అనంతరం సాయికృష్ణ, మిగతా ఆరుగురు, మైనర్ కలిసి ఒడిశాలో కిలో రూ.8 వేలకు గంజాయి కొనుగోలు చేశారని చెప్పారు. కొంత తాగి, మిగతాది యాభై గ్రాముల ప్యాకెట్లుగా చేశారని అన్నారు. మిగతా విక్రయిస్తున్నారని తెలిపారు. చినకాకాని హాయ్‌ల్యాండ్ సమీపాన గంజాయి తాగే సాధం పవన్‌మాధవ్ (దుగ్గిరాల), సొంటి విష్ణువర్ధన్ (పెద్దపాలెం), కుందేటి చెన్నకేశవ (పెరికలపూడి), సాయన అనంతకుమార్ (కానూరు, విజయవాడ), మందా అమాన్ (లింగంపల్లి, తెలంగాణ), మలబండి చంద్రశేఖర్ (కాజ), మరో మైనర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారని అన్నారు. ఈ మేరకు పదిహేను మందిని అరెస్ట్ చేసి, 4.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. పరారీలో ఉన్న డొరాను పట్టుకుంటామని తెలిపారు. నిందితుల్లో పలువురిపై గతంలోనూ వివిధ కేసులు ఉన్నట్లు చెప్పారు. కేసును ఛేదించిన మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ ఏవీ బ్రహ్మం, ఎస్‌ఐ సీహెచ్ వెంకటేశ్వర్లు, హెచ్‌సీలు రత్న రాజు, డి.శ్యాంకుమార్, బి.రామలింగేశ్వరరావు, చలమరావు, పి.మణికుమార్, పీసీలు సాగర్‌బాబు, కేవీ శ్రీనివాసరావు, ఎం.రాములను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు.


