ముగిసిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం కెఎల్ యూనివర్శిటీలో జరుగుతున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బుధవారంతో ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి అమరావతి బోటింగ్ క్లబ్ అధ్యక్షులు తరుణ్ కాకాని ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
● ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ భారత క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారని అన్నారు.
● వర్శిటీ వీసీ డాక్టర్ జి. పార్థసారథి వర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నాలుగు జోన్లలో విజేతలైన 16 యూనివర్శిటీల నుంచి 16 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. చివరి ఫైనల్ మ్యాచ్‌లో ప్రథమ విజేతగా కర్ణాటకకు చెందిన జైన్ యూనివర్శిటీ జట్టు, ద్వితీయ విజేతగా పంజాబ్‌కు చెందిన చండీఘర్ యూనివర్శిటీ నిలిచిందని పేర్కొన్నారు.
● కేరళకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ కాలికట్, చైన్నెకు చెందిన ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టి యూనివర్శిటీలు రెండు మూడు స్ధానాల్లో నిలవగా తృతీయ బహుమతిని రెండు వర్శిటీలకు కలిపి అందజేశామని తెలిపారు.
● అనంతరం తరుణ్‌ను వర్శిటీ యాజమాన్యం ఘనంగా సత్కరించింది.
● కె.ఎల్.యూ క్రీడల డైరెక్టర్ కె. హరికిషోర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు మంచి ప్రోత్సాహాన్ని అందించడం ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా యూనివర్శిటీల పరిశీలకులు డాక్టర్ కిరణ్, కె.ఎల్.యూ ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్. వెంకట్‌రామ్, డాక్టర్ కె. రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్‌చార్జి డీన్ కెఆర్‌ఎస్ ప్రసాద్, డీన్ సలహాదారు డాక్టర్ హబీబుల్లా ఖాన్, వ్యాయామ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


