నృసింహుని మండల దీక్షలు స్వీకరణ
మంగళగిరి టౌన్: మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఎగువ సన్నిధిలోని శ్రీ పానకాల స్వామివారి ముఖ మండపం వద్ద బుధవారం భక్తులు నృసింహుని మాలధారణ మండల దీక్షలు స్వీకరించారు. ప్రధాన అర్చకులు గురుస్వామి మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు భక్తులకు మాలధారణ వేసి దీక్ష ఇచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల సేవా ట్రస్ట్ చైర్మన్ తోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాలధారణ స్వీకరించే సుమారు 150 మంది భక్తులకు దీక్షా వస్త్రాలు ఉచితంగా అందజేశారు. భక్తబృందం ప్రతినిధులు పాల్గొన్నారు.
హుండీ ఆదాయం రూ. 66.66 లక్షలు
మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హుండీ కానుకలను బుధవారం దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్‌రోడ్‌లోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి మొత్తం రూ. 66,66,337 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో కంటే రూ.10,87,494 అధికంగా వచ్చినట్లు వివరించారు. లెక్కింపు కార్యక్రమాన్ని శ్రీ జగన్నాధ శ్రీఆంజనేయ శ్రీ వెంకటేశ్వరస్వామి వార్ల గ్రూప్ దేవస్థానాల కమిషనర్, కార్యనిర్వహణాధికారి సుభద్ర పర్యవేక్షించారు.


