నత్త నడకన రీ సర్వే | - | Sakshi
Sakshi News home page

నత్త నడకన రీ సర్వే

Jan 21 2026 7:03 AM | Updated on Jan 21 2026 7:03 AM

నత్త

నత్త నడకన రీ సర్వే

నత్త నడకన రీ సర్వే

న్యూస్‌రీల్‌

హనుమాన్‌ చాలీసా పారాయణం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన రీసర్వే కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. నాడు తప్పు జరిగిపోతోందంటూ తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పనిని మళ్లీ మొదలుపెట్టింది. అయితే ఆ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద రీ సర్వే పనులను తప్పు పట్టిన చంద్రబాబు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మళ్లీ దీన్ని పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకుంది.

మూలన పడేసిన డ్రోన్లు...

2024 జూన్‌ తర్వాత జిల్లాలో 2వ విడత రీసర్వేలో 24 గ్రామాలకుగానూ సుమారు 67 వేల ఎకరాల భూ సర్వే నిర్వహించారు. 3వ విడతలో ప్రస్తుతం 35 గ్రామాల్లో రీ సర్వే జరుగుతుంది. అప్పటి డ్రోన్స్‌లో కొన్ని మూలన పడేశారు. మరమ్మతులు కూడా చేయించకుండా ప్రజాధనాన్ని వృథా చేయడంతోపాటు రీసర్వే కూడా ఆలస్యమవుతుంది.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 62 గ్రామాలలో 1,42,450 ఎకరాల భూమిని రీ–సర్వే చేశారు. ఎనిమిది గ్రామాల్లో గ్రామకంఠం భూములను కూడా రీ–సర్వే పూర్తి చేశారు. దీనికి ఇరువైపులా సుమారు 84 వేల సర్వే రాళ్ళు కూడా వేశారు.

తొలిసారిచేసిన కృషి ఎంత చెప్పినా తక్కువే. గతంలో ఎన్నడూ చేయని గ్రామ కంఠం భూములను సైతం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టి ఔరా అనిపించింది. దీనిలో భాగంగా 66 గ్రామాల్లోని 9920 మందికి సంబంధించిన గ్రామ కంఠం భూములకు ఉచితంగా పట్టాలు సైతం అందజేశారు.

ఎప్పుడో 1905లో బ్రిటీషర్లు చేపట్టిన తర్వాత 2020 వరకు మరే నాయకుడు దీని జోలికి వెళ్లే ధైర్యం చేయలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ రీ–సర్వేని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దీని ద్వారా ప్రతి అంగుళం భూమి మ్యాపింగ్‌లోకి తీసుకురావడంతోపాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే దిశగా ఈ ప్రక్రియ గుంటూరు జిల్లాలో 2020 డిసెంబర్‌లో ప్రారంభమయ్యింది.

తొలుత పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద దుగ్గిరాల మండలం దేవరాపల్లి అగ్రహారం, ప్రత్తిపాడు మండలం కొండజాగర్లమూడి, వేమూరు మండలం పులిచింతలపాలెం, యడ్లపాడు మండలం మర్రిపాలెం, దాచేపల్లి మండలం అలుగుమల్లిపాడులను ఎంపిక చేశారు. అక్కడ విజయవంతంగా పూర్తి చేశారు.

సర్వే అనంతరం సంబంధిత భూమి, స్థలం యజమానికి ప్రింటెడ్‌ పాస్‌బుక్‌ ఉచితంగా ఇచ్చారు.

రీసర్వేలో వాడిని టెక్నాలజీ అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే మనం చూడగలం. అయితే అప్పటి ప్రభుత్వం అత్యాధునిక డ్రోన్స్‌, రోవర్స్‌తోపాటు 840 మంది సర్వేయర్లను కూడా ఉపయోగించింది.

అప్పటికే కొరతగా ఉన్న సర్వేయర్లను సచివాలయ వ్యవస్థ ద్వారా నియమించి విజయవంతంగా రీ సర్వే చేసింది. దీనివల్ల ఎన్నో సివిల్‌, క్రిమినల్‌ తగాదాలు తగ్గుముఖం పట్టాయి.

ఇటీవల కలెక్టరేట్‌లోని రీసర్వే భవనంలో అధికారి ఉండే చాంబర్‌ సీలింగ్‌ కూలిపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. దీనిని కనీసం మరమ్మత్తులు కూడా చేయించకుండా తాత్కాలికంగా ఇరిగేషన్‌ కార్యాలయంపై ఖాళీగా ఉన్న భవనంలోకి మార్చుకున్నారు. శకునం చూసే బల్లి కుడితిలో పడ్డట్లుంది ఆ శాఖ పరిస్థితి.

గుంటూరు
బుధవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2026

భూ సర్వేలతో చరిత్ర సృష్టించిన

గత ప్రభుత్వం

అందుబాటులోకి తెచ్చిన

ఆధునిక సాంకేతికత

దేశంలోనే ఆదర్శంగా నిలిచిన

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

62 గ్రామాల్లో సుమారు

1.46 లక్షల ఎకరాల భూమి రీసర్వే

ప్రస్తుతం అంతంత మాత్రంగానే

జరుగుతున్న సర్వే పనులు..

టీడీపీ ప్రభుత్వంలో 24 గ్రామాల్లో

కూడా పూర్తి కాని సర్వే...

‘సంక్షేమం’లో సంక్షోభం

ఫిరంగిపురం: స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలోని దక్షిణాముఖ ఆంజనేయ స్వామికి మంగళవారం హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించారు.

నత్త నడకన రీ సర్వే 1
1/5

నత్త నడకన రీ సర్వే

నత్త నడకన రీ సర్వే 2
2/5

నత్త నడకన రీ సర్వే

నత్త నడకన రీ సర్వే 3
3/5

నత్త నడకన రీ సర్వే

నత్త నడకన రీ సర్వే 4
4/5

నత్త నడకన రీ సర్వే

నత్త నడకన రీ సర్వే 5
5/5

నత్త నడకన రీ సర్వే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement