వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం
వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం రేపల్లె: మాఘమాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని రేపల్లె పట్టణంలోని పట్టాభిరామస్వామి ఆలయంలో లక్ష్మీ, పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవ వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. వేకువ జామునే స్వామివారికి, దేవేరులకు మంగళస్నానాలు చేయించి వధువరులుగా అలంకరించారు. వేదమంత్రాల నడుమ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు తడవర్తి విజయ్‌కుమార్, రాధికారాణి, పవన్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పూజ్య
ధర్మాచార్య సదస్సు కొండకు నిప్పు పెట్టిన
అల్లరి మూకలు తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లి కొండపై గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం నిప్పు పెట్టడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. గంట వ్యవధిలో సుమారు 15 ఎకరాల వరకు తగలబడింది. కొంతమంది స్థానికులు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మంగళగిరి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినా వారి వద్ద నుంచి ఎటువంటి స్పందన లభించలేదు. స్థానికులు జాగ్రత్తలు తీసుకోవడం, కొండపై మంటలు కిందకు వ్యాపించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
కల్యాణ రాజశ్యామలాదేవిగా బగళాముఖి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్నందు సమరసత సేవా ఫౌండేషన్ వారి పూజ్య ధర్మాచార్య సదస్సును మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అహోబిల రామానుజ జీయర్ స్వామి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఈ సమరసత సేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వామీజీలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు, ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలో మాఘమాసం సందర్భంగా రాజశ్యామలా నవరాత్ర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మహోత్సవాలలో భాగంగా మంగళవారం బగళాముఖి అమ్మవారు కళ్యాణ రాజశ్యామలాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 28వరకు అమ్మవారి ఆలయంలో రాజశ్యామలా నవరాత్ర మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కార్యనిర్వాహణాధికారి నరసింహమూర్తి, చైర్మన్ చక్రధర్‌రెడ్డి తెలిపారు.
1/1
వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం