ఒంగోలు జాతి వృషభ రాజాల బల ప్రదర్శనలో విజేతలు
● రెండు పళ్ల విభాగంలో.. దొండపాడుకు చెందిన యర్రం రాజశేఖర్, యశ్వంత్‌లకు చెందిన ఎడ్ల జత 4095.4 మీటర్లు లాగి ప్రథమస్థానంలో నిలిచింది. ఆర్‌కే బుల్స్ అత్తోట శిరీషాచౌదరి, శివకృష్ణచౌదరి (వేటపాలెం)ల ఎడ్ల జత ద్వితీయస్థానంలో, చాగంటి శ్రీనివాస్‌చౌదరి(కొండెపాడు), పల్లం రిత్విక్‌చౌదరి, యువాన్ చౌదరి(ఉప్పుగుండూరు)ల ఉమ్మడి ఎడ్ల జత తృతీయస్థానంలో నిలిచాయి.
● నాలుగు పళ్ల విభాగంలో... కొప్పుల గోవర్థన్‌రెడ్డి, ప్రవలీష్‌రెడ్డి(సూర్యాపేట)ల ఎడ్ల జత 3966.4 మీటర్ల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. చిలుకూరి నాగేశ్వరరావు(జెపంగులూరు), శశంక్‌శ్రేయా (కోడుమూరు)ల ఎడ్ల జత ద్వితీయస్థానంలో, బచ్చిగారి విజయలక్ష్మినాయుడు(ఆకవీడు), కెవీ హేమలతారెడ్డి (కడప)ల ఎడ్ల జత తృతీయస్థానంలో నిలిచాయి.
26న రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ చిట్టినగర్(విజయవాడపశ్చిమ):విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో 26వ తేదీ రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఎ.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6 ఏళ్ల నుంచి 90 సంవత్సరాల వయస్సు వరకు ఎవరైనా పోటీల్లో పాల్గొనవచ్చునని చెప్పారు. 7, 9, అండర్ 11 , అండర్ 13, అండర్ 15 బాల బాలికలకు ప్రత్యేక ట్రోఫీలను అందిస్తామని తెలిపారు. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు నగదు బహుమతులు అందచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారుల కోసం భోజన వసతి కల్పిస్తామని వెల్లడించారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆర్గనైజర్ జె.మల్లేశ్వరరావు 99598 77276 , డైరెక్టర్ ఎ.రామకృష్ణ– 99486 79397లకు ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని గోల్కొండ గార్డెన్స్‌లో జాతీయస్థాయి ఒంగోలు జాతి వృషభరాజాల బల ప్రదర్శన ఉత్సాహంగా సాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి రైతులు తమ ఎడ్లజతలను తీసుకువచ్చి పోటీలలో పాల్గొంటున్నారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పోటీలలో రెండు పళ్ల, నాలుగు పళ్ల విభాగాల్లో విజేతలైన ఎడ్లజతల వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. వారికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, శ్రావణ్‌కుమార్‌లు నగదు, జ్ఞాపికలను అందజేశారు.
కాలువలోకి దిగిన యువకుడు గల్లంతు
బాపట్లటౌన్: స్నానం చేసేందుకు కాలువలోకి దిగిన యువకుడు గల్లంతైన ఘటన మండలంలోని నరసాయపాలెం శివారులో చోటుచేసుకుంది. నరసాయపాలెం గ్రామానికి చెందిన మిక్కిలి శరత్‌బాబు మంగళవారం సాయంత్రం నరసాయపాలెం లాకులు సమీపంలో కొమ్మమూరు కాలువలో స్నానం చేసేందుకు దిగారు. కాలువ నీరు ఉధృతంగా రావడంతో కాలువలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు శరత్ కోసం గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు.
1/1
ఒంగోలు జాతి వృషభ రాజాల బల ప్రదర్శనలో విజేతలు