గణతంత్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలన
తాడికొండ: గుంటూరు జిల్లా రాయపూడిలో రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకల ఏర్పాట్లను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు పరిశీలించారు. ఈ మేరకు ఆయన మంగళవారం గుంటూరు కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, ఐజీ రాజకుమారి, ఎస్పీ వకుల్ జిందాల్, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. గవర్నర్, ముఖ్యమంత్రి వచ్చే మార్గాలతో పాటు స్టేజీ, ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు. పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్‌అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ భార్గవ తేజ తదితరులు పాల్గొన్నారు.


