ప్రతిభ చాటిన మంగళగిరి కోచ్
మంగళగిరి టౌన్: పంజాబ్ రాష్ట్రం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ పాటియాలాలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈనెల 14,15,16 తేదీల్లో నిర్వహించిన ఏఎఫ్‌ఐ స్టాటర్స్ సెమినార్ కం ఎగ్జామినేషన్‌లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన డాక్టర్ సాతులూరి రాజు ఉత్తీర్ణత సాధించారని ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరి గౌతమ్‌కిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 44 మంది మాత్రమే పాల్గొనడానికి అర్హత సాధించగా వారిలో 32 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. డాక్టర్ రాజు ప్రస్తుతం హైదరాబాద్‌లోని సీబీఐటీ కళాశాలలో అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఖేలో ఇండియా అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల అథ్లెటిక్స పోటీల్లో స్టాటరుగా వ్యవహరించారని, జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజును పలు క్రీడల అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.


