ఉద్యోగులను తొలగిస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
పిడుగురాళ్ల: సీ్త్రశక్తి పథకంపై తనిఖీలు అంటూ ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు తెలిపారు. పట్టణంలోని ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ పల్నాడు జిల్లా నిర్మాణ కమిటీ సమావేశం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం నిర్వహించారు. పిడుగురాళ్ల ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో ఈ మహాసభను ప్రారంభించారు. ఈ సందర్భంగా దామోదరరావు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టిన సీ్త్రశక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో ఏపీపీటీడీ(ఆర్టీసీ) సిబ్బంది అంకిత భావంతో కృషి చేస్తున్నారన్నారు. బస్సుల కండీషన్ బాగాలేకపోయినా, టిమ్స్ సరిగా పనిచేయకుండా.. ఇబ్బంది పెడుతున్నా పని చేస్తున్నామన్నారు. ఈ పథకం అమలులో రోజువారి డ్యూటీల్లో కండక్టర్లు, డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను గాని, పెరుగుతున్న తీవ్రమైన పని ఒత్తిడిని గానీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఆర్టీసీ తనిఖీ అధికారులు అత్యుత్సాహం చూపిస్తూ విధి నిర్వహణలో జరుగుతున్న చిన్న చిన్న పొరపాట్లపై కేసులు రాస్తూ.. ఉద్యోగులను సస్పెండ్లు చేయడమే కాకుండా తీవ్రమైన పనిష్మెంట్లు ఇస్తున్నారని, ఇలాగైతే భవిష్యత్‌లో కండక్టర్లు, డ్రైవర్లు డ్యూటీలు చేయడమే కష్టం అవుతుందన్నారు. ఇప్పటికై నా సీ్త్ర శక్తి పథకం కేసుల్లో సస్పెండ్ చేసే విధానాలు మానుకోవాలని, లేకపోతే భవిష్యత్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఈయూ ఆధ్వర్యంలో ఉద్యమాల బాట పట్టక తప్పదని హెచ్చరించారు.


