పేద రోగుల సేవలో జింకానా | - | Sakshi
Sakshi News home page

పేద రోగుల సేవలో జింకానా

Jan 20 2026 7:50 AM | Updated on Jan 20 2026 7:50 AM

పేద ర

పేద రోగుల సేవలో జింకానా

పేద రోగుల సేవలో జింకానా జింకానా దేశానికే ఆదర్శం

గుంటూరు జీజీహెచ్‌కు రూ.100 కోట్ల విరాళం గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల దాతృత్వం పూర్వ వైద్య విద్యార్థుల విరాళాలతో మాతా శిశు సంరక్షణ కేంద్రం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే నిర్మాణం ప్రారంభం ప్రస్తుతం తుది దశకు చేరుకోవడంతో ఈ నెల 30న ప్రారంభానికి సన్నాహాలు రూ.20 కోట్లు విరాళం ఇచ్చిన డాక్టర్‌ ఉమా గవిని రూ.10 కోట్లు విరాళం ఇచ్చిన డాక్టర్‌ పొదిల ప్రసాద్‌

ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వైద్య విద్యార్థులంతా ఒక సంఘంగా ఏర్పడి చదువుకున్న మాతృ సంస్థ రుణం తీర్చుకుంటూ సంస్థ అభివృద్ధికి అవిరళ కృషి చేస్తున్నారు. ఆ సంఘం పేరే జింకానా. గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్లంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడి తాము చదువుకున్న కళాశాలను మరిచిపోకుండా అభివృద్ధికి కృషి చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. గుంటూరు వైద్య కళాశాల అల్యూమిని ఆఫ్‌ నార్త్‌ అమెరికా (జింకానా) 1981లో ఏర్పడింది. సుమారు 2,500 మంది పూర్వ విద్యార్థులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరంతా ప్రతి ఏడాది గుంటూరు వైద్య కళాశాలకు, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అభివృద్ధికి విరాళాలు అందజేస్తున్నారు. – గుంటూరు మెడికల్‌

గుంటూరు జీజీహెచ్‌లో, వైద్య కళాశాలలో ఏళ్ల తరబడి అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు నిధులు వెచ్చిస్తున్న జింకానా తాజాగా జీజీహెచ్‌లో ఎంసీహెచ్‌ (మాతా శిశు సంరక్షణ కేంద్రం) వార్డు నిర్మాణం కోసం రూ. 100 కోట్లు కేటాయించింది. భవన నిర్మాణం పూర్తవడంతో ఈనెల 30న ప్రారంభించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జింకానా ఆధ్వర్యంలో కళాశాల, ఆసుపత్రికి ప్రతీ ఏడాది నిధులు అందుతున్నా 2004లో కళాశాలలో జింకానా ఆడిటోరియం నిర్మాణంతో పూర్వ విద్యార్థుల సేవలు వెలుగులోకి వచ్చాయి. సుమారు రూ.2.50 కోట్లతో 850 సీటింగ్‌ సామర్థ్యంతో జింకానా ఆడిటోరియం నిర్మించారు. 2009లో రూ.35 కోట్లతో డాక్టర్‌ పొదిల ప్రసాద్‌ సూపర్‌ స్పెషాలిటీ, ట్రామా సెంటర్‌ భవన నిర్మాణం జరుగ్గా అందులో రూ.20 కోట్లు జింఖా నా సభ్యులు విరాళంగా అందజేశారు. డాక్టర్‌ పొదిల ప్రసాద్‌ ఒక్కరే రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడంతో పొదిల ప్రసాద్‌ భవన నిర్మాణం జరిగింది. ప్రపంచ స్థాయి మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్స్‌ నిర్మించడంతో డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో గుండె మార్పిడి ఆపరేషన్లు చేయడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.

తాజాగా ఎంసీహెచ్‌ నిర్మాణం

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మాతా శిశు మరణాలు తగ్గింపే లక్ష్యంగా గుంటూరు జీజీహెచ్‌లో మాతా, శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌ వార్డు) నిర్మించాలని నిర్ణయించాయి. సుమారు పదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న ఎంసీహెచ్‌ నిర్మాణం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభమై చివరి దశకు చేరుకుంది. భవన నిర్మాణం చేపట్టేందుకు ఉన్న అడ్డంకులన్ని తొలగిపోయేలా గత ప్రభుత్వం చేయూతనివ్వడంతో జింఖానా సభ్యులు రూ. 100 కోట్లు విరాళం ఇచ్చి భవన నిర్మాణం పూర్తి చేశారు. గతంలో జీజీహెచ్‌లో డాక్టర్‌ పొదిల ప్రసాద్‌ సూపర్‌ స్పెషాలిటీ మిలీనియం బ్లాక్‌ నిర్మాణం కోసం రూ. 5 కోట్లు విరాళం ఇచ్చిన డాక్టర్‌ పాదిల ప్రసాద్‌ ఎంసీహెచ్‌ వార్డు నిర్మాణం కోసం మరో రూ. 5 కోట్లు విరాళం ఇచ్చారు. అతేకాకుండా డాక్టర్‌ పొదిల ప్రసాద్‌ సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌పైన రెండంతస్తులు నిర్మాణం చేసేందుకు రూ. 10 కోట్లు విరాళం అందజేశారు. జింకానా సభ్యుల్లో 200 మంది విరాళాలు అందించారు. వీరిలో అత్యధికంగా డాక్టర్‌ ఉమ గవిని రూ. 20 కోట్లు అందజేయడంతో ఆమె భర్త డాక్టర్‌ కానూరి రామచంద్రరావు పేరుతో ఎంసీహెచ్‌ వార్డు నిర్మాణం చేస్తున్నారు. డాక్టర్‌ కె.వెంకట్రావు, రమాదేవి వాసిరెడ్డి దంపతులు రూ.4.3 కోట్లు, డాక్టర్‌ మువ్వా వెంకటేశ్వరరావు, వేదవతి దంపతులు రూ.4 కోట్లు, తాతినేని గోపాలరావు రూ. 4 కోట్లు ఎంసీహెచ్‌ నిర్మాణం కోసం అందజేశారు.

ఎంసీహెచ్‌ ప్రత్యేకతలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా లేని విధంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌) 600 పడకలతో ఐదంతస్తులు భవనాన్ని నిర్మించారు. అప్పుడే పుట్టిన పసికందులకు, గర్భిణులు, బాలింతలకు కార్పొరేట్‌ వైద్యసేవలు ఎంసీహెచ్‌ వార్డులో ఉచితంగా అందనున్నాయి. ప్రపంచ స్థాయి వైద్య ప్రమాణాలతో నిర్మించిన అత్యాధునిక మాడ్యూలర్‌ ఆపరేషన్‌ థియేటర్లు తొమ్మిది ఉన్నాయి. 29న జింకానా సభ్యులంతా ఎంసీహెచ్‌ వార్డులో హాజరు కానున్నారు.

పేద రోగుల సేవలో జింకానా 1
1/2

పేద రోగుల సేవలో జింకానా

పేద రోగుల సేవలో జింకానా 2
2/2

పేద రోగుల సేవలో జింకానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement