తెగుళ్ల దిగులు
తెనాలి మండలంలో 20 వేల ఎకరాల్లో జొన్న,
ఖరీఫ్ వరిలో మోంథా, దిత్వా తుఫాన్‌ల దెబ్బకు
రబీ పంటలకు సరైన గిట్టుబాటు ధర
మొక్కజొన్న తోటలో
తెనాలి టౌన్: ఆరుగాలం కష్టించే రైతుకు పండించిన పంట చేతికి వచ్చి అమ్ముకునే వరకు గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. తెనాలి మండలంలో దాదాపు 20 వేల ఎకరాల్లో ఖరీఫ్‌లో వరి సాగు చేపడితే ఆదిలోనే మోంథా , పంట చేతికి వచ్చే సరికి దిత్వా తుఫాన్‌లు ముంచేశాయి. ఎకరాకు రూ. 30 వేల నుంచి 35 వేల కౌలు చెల్లించి రూ.10వేల నుంచి రూ.15వేలు పెట్టుబడి పెట్టి దిగుబడి రాక సరైన గిట్టుబాటు ధర లేక వరి పైరు వేసిన రైతులు డీలా పడ్డారు. ఎకరాకు 20 నుంచి 25 వేల రూపాయలు నష్టం చవిచూశారు. రబీ సాగుగా ఈ ప్రాంతంలో జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర చేపట్టారు. ప్రస్తుతం 30 నుంచి 40 రోజుల దశలో జొన్న, మొక్కజొన్న పైరు ఉంది. మొక్కజొన్నను కతైర పురుగు ఆశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెబుతున్నారు. మూడు తడుల నీళ్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు ఖర్చు అవుతుందని వివరించారు. మార్చి చివరి వారం, ఏప్రిల్ నెలలో పంట చేతికి వస్తుందని అన్నారు. జొన్న, మొక్కజొన్నకై న ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు.
కతైర పురుగు ..సమగ్ర యాజమాన్య పద్ధతులు
మొక్కజొన్న సాగు చేసే రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని, పురుగు ఉధృతి అధికంగా ఉంటే యాజమాన్య పద్ధతులతో నివారించకుంటే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏవో సుధీర్‌బాబు సూచించారు.
మొక్కజొన్న, మినుము, పెసర పైరు
నిండా మునిగిన రైతాంగం
రాకుంటే అప్పుల ఊబిలోకి రైతులు
తెగుళ్ల దిగులు
తెగుళ్ల దిగులు


