అర్జీల పరిష్కారంపై శ్రద్ధ వహించాలి
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పీజీఆర్‌ఎస్‌లో 195 అర్జీలు స్వీకరణ
లక్ష్మీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్‌లలో ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలితో కలసి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్‌లో వస్తున్న అర్జీలను పరిశీలించారు. మొత్తం 195 అర్జీలు అందాయి. రెవెన్యూ క్లినిక్‌లో అందిన అర్జీల ను కలెక్టర్ పరిశీలించారు. రెవెన్యూ క్లినిక్‌కు నాలు గు కౌంటర్‌లు ఏర్పాటుచేశారు. పీజీఆర్‌ఎస్‌లో అందిన కొన్ని అర్జీల వివరాలు ఈవిధంగా ఉన్నాయి..
డీఆర్వో శ్రీనివాసరావు, డెప్యూటీ కలెక్టర్‌లు గంగరాజు, లక్ష్మీకుమారి, శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, డీపీఓ బి.వి.నాగసాయికుమార్, డీఆర్‌డీఏ పీడీ వి.విజయలక్ష్మి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి.సత్యనారాయణ, జిల్లా ఉపా ధి కల్పన అధికారి డి.దుర్గాభాయి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు పాల్గొన్నారు.


