యూరియా కోసం రైతుల పడిగాపులు
దుగ్గిరాల: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. దుగ్గిరాలలోని ప్రాథమిక వ్వవసాయ కేంద్రం వద్ద రైతులు సోమవారం యూరియా కోసం క్యూలైనులో బారులు తీరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు రైతులను వారి కష్టాలు గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పనులు మానుకొని యూరియా కోసం నిత్యం లైనులో నిల్చోవాల్సి రావడం దారుణం అని అన్నారు. ఆధార్ కార్డుకి ఐదు కట్టలు ఇవ్వటం, సిఫార్సు ఉంటే ట్రాక్టరు నిండా తీసుకెళుతున్నారని అన్నారు. డీఏపీ లిక్విడ్ కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామని షరతులు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికై నా రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఎరువులను సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో జెట్టి బాలరాజు, వై.బ్రహ్మేశ్వరరావు, వెంటేశ్వరరావు, జానీ, లక్ష్మణరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


