కుమార్తె అదృశ్యంపై తండ్రి ఫిర్యాదు..
గత ఏడాది మార్చి 15న కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయింది. తెలిసిన వ్యక్తులు, బంధువుల వద్ద ఆరా తీసినా ఆచూకీ లేదు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా. నెలలు గడిచినా పట్టించుకోలేదు. నాలుగైదు నెలలు తర్వాత కుమార్తె వేరే మొబైల్‌ఫోన్ నుంచి ఫోన్ చేసి మాట్లాడింది. ఆ ఫోన్ నంబర్‌ను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాను. కనీసం ఆ ఫోన్ ఎవరిది, ఏ ఏరియా నుంచి వచ్చిందనేది ఆరాతీయలేదు. అప్పటి నుంచి పలుమార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా ఫలితంలేదు. ఒకే ఒక్క కుమార్తె కావడంతో గారాబంగా పెంచుకున్నా. ఏడాది నుంచి కుమార్తె ఆచూకీ తెలియరాలేదు. కుమార్తె చిరునామా గుర్తించగలరు.
– దివ్యాంగుడు పి.ఏసోబు, ఆర్.అగ్రహారం


