పెళ్లిళ్ల పేరుతో మోసం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లాడిన నిత్య పెళ్లి కొడుకుపై బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. పెళ్లి కాలేదని చెప్పి రెండు వివాహాలు చేసుకున్నాడని వాపోయారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా వినతుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదిదారులతో మాట్లాడి, వారి వినతులను జిల్లా ఎస్పీ పరిశీలించారు. అనంతరం బాధితుల ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడారు.
పోలీస్ ప్రజా వినతుల పరిష్కార వేదికలో మహిళల ఫిర్యాదు


