సాహిత్య సేవలు స్ఫూర్తిదాయకం
నగరంపాలెం: తెలుగు వాడైన యూపీ ఏసీబీ ఏడీజీపీ కిల్లాడి సత్యనారాయణ సాహిత్య సేవలు స్ఫూర్తిదాయకమని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకాతిరుమలరావు అన్నారు. నగరంపాలెం బొమ్మిడాల ఆర్యవైశ్య వసతి సమావేశ మందిరంలో విశ్వనాథ సాహిత్య అకాడమీ, మెట్టు సత్యనారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మెట్టు సత్యనారాయణరెడ్డి స్మారక సాహిత్య పురస్కారం సభ ద్వారా ప్రముఖ సాహితీవేత్త రచయిత కిల్లాడి సత్యనారాయణను సత్కరించారు. ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ సాహిత్యపరంగా ఉన్నతంగా రాణించి, కీర్తి గడించడం తెలుగు వారికి గర్వకారణమని అన్నారు. సభకు సాహితీవేత్త మోదుగుల రవికృష్ణ అధ్యక్షుడు వహించగా, కిల్లాడి సత్యనారాయణ సాహిత్య ప్రస్థానంపై కవి డాక్టర్ సుంకర గోపాలయ్య సాహిత్య సమీక్ష నిర్వహించారు. సభలో వీవీఐటి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ఎస్వీ రామారావు, మెట్టు సత్యనారాయణరెడ్డి, రెడ్డి విద్య కళాశాల ప్రిన్సిపల్ సెట్లం చంద్రమోహన్, జన చైతన్య వేదిక అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి, సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీతలు డాక్టర్ పాపినేని, పెనుగొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ సీహెచ్.సుశీలమ్మ, డాక్టర్ నాగరాజ్యలక్ష్మి, బండ్ల మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ
సీహెచ్ ద్వారకా తిరుమలరావు


