సమాజాన్ని జాగృతం చేసిన యోగి వేమన
నగరంపాలెం: సమాజాన్ని జాగృతం చేసిన మహానుభావుడు యోగి వేమన అని జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో యోగి వేమన జయంతి నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఏఎస్పీ హనుమంతు మాట్లాడుతూ యోగి వేమన బోధించిన నీతి సూత్రాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. యోగి వేమన ప్రజాకవిగా, సామాజిక సంస్కర్తగా సమాజంలో విశిష్ట స్థానం సంపాదించుకున్నారని అన్నారు. కుల, మత భేదాలు, మూఢనమ్మకాలను రూపుమాపేందుకు ఆయన తన పద్యాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని తెలిపారు. సమానత్వం, మానవ విలువలు, నైతికతలను సమాజంలో పెంపొందించడంలో వేమన చేసిన సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాసులు (ఎస్‌బీ), సుంకరయ్య (ఏఆర్), ఎస్‌బీ సీఐ అలహరి శ్రీనివాస్, ఏఏఓ జగన్నాథరావు, ఆర్‌ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్ తదితరులు నివాళులర్పించారు.
జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు


