జిల్లా ఏఆర్ డీఎస్పీగా సంకురయ్య
నగరంపాలెం: జిల్లా ఏఆర్ డీఎస్పీగా కె.సంకురయ్య సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఏఆర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్‌కు చెందిన ఆయన ఆర్‌ఎస్‌ఐగా విధుల్లో చేరారు. 2014లో ఆర్‌ఐగా ఉద్యోగోన్నతి పొందారు. అప్పటి నుంచి 2019 వరకు గుంటూరు రూరల్ జిల్లా ఆర్‌ఐగా విధులు నిర్వర్తించారు. 2019 నుంచి 2022 వరకు సీఏఆర్ విజయవాడలో విధులు నిర్వర్తించగా, 2022లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. అనంతరం నంద్యాల, విజయవాడ, అక్టోపస్ మంగళగిరి డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ గుంటూరు ఏఆర్ డీఎస్పీగా బదిలీయ్యారు. అనంతరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను ఆయన మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందించారు.


