గండాలయ స్వామికి ప్రత్యేక పూజలు
మంగళగిరి టౌన్: మంగళగిరి కొండపై ఉన్న శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి కొండపైన ఉన్న గండాలయ స్వామి వారికి అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు నూనె సమర్పించి దీపాలు వెలగించారు. గండాలు రాకుండా స్వామి వారి రక్షణ కోరారు. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు కొండ మెట్ల మార్గంలోను, ఎయిమ్స్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న కొండ ఘాట్‌రోడ్ మార్గం ద్వారా స్వామిని చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
భక్తులకు అన్నదానం
మంగళగిరి పట్టణంలోని శివాలయం వద్ద అమావాస్యను పురస్కరించుకుని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం భక్తులకు అన్నదానం నిర్వహించారు. పలువురు ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ కార్యక్రమం విరామం లేకుండా కొనసాగుతోందని, గత మూడు సంవత్సరాలుగా ప్రతి అమావాస్య రోజున అన్నదానం చేస్తున్నామని చెప్పారు. సుమారు 4 వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. 40 మంది దాతల సహకారం అందించారన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సాంబశివరావు, సభ్యులు శివసత్యనారాయణ, ప్రసాద్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గండాలయ స్వామికి ప్రత్యేక పూజలు


