రాహు కేతు పూజలకు పోటెత్తిన భక్తులు
పెదకాకాని: శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో రాహుకేతు పూజలు జరిపించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం మౌళి అమావాస్య పురస్కరించుకుని పెదకాకాని శివాలయంలో రాహు కేతు పూజలు భక్తులు అధిక సంఖ్యలో జరిపించుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం రాహుకాలం 4:30 గంటల వరకూ 1276 టికెట్లు విక్రయించినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. రాహు కేతు పూజల ద్వారా ఆదివారం రూ.6,38,000 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఆదివారం ఆలయంలో అంత్రాలయ అభిషేకాలు, అంత్రాలయ దర్శనాలు, వాహనపూజలు, అన్నప్రాసనలు, నవగ్రహ పూజలు అధికసంఖ్యలో జరిగాయి. భక్తులందరికీ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.


