రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
మంగళగిరి టౌన్: మనస్తాపానికి గురై ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళగిరిలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి పట్టణం ఇందిరానగర్‌కు చెందిన కోలా రాజేష్‌కుమార్ (22) ఇంట్లో తన తండ్రితో గొడవపడి వచ్చిన రాజేష్‌కుమార్ నాలుగు రోజుల నుంచి బాబాయ్ దగ్గర ఉంటున్నాడు. ఆదివారం తిరిగి ఇంటికి వెళ్లిన క్రమంలో మరల తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది నిడమర్రు రైల్వేగేటు సమీపంలో ట్రాక్ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గుంటూరు రైల్వేపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య


