బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు చేరిన ఆరు జట్లు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల టోర్నమెంట్ 2026 ఆదివారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సౌత్ జోన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరి డాక్టర్ కె.హరికిషోర్ మాట్లాడుతూ మొదటి, రెండవ రోజులు మొత్తం 16 జట్లు పోటీపడ్డాయని, ఆదివారానికి 8 జట్లు గెలుపొందాయని తెలిపారు. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న వాటిలో కేరళకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలికట్, ఆర్‌ఎన్‌టీయూ భోపాల్ జట్లతో పాటు మరో ఆరుజట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నట్లు పేర్కొన్నారు. సోమవారం సెమీ ఫైనల్స్ అనంతరం మంగళవారం ఫైనల్ పోటీలు జరుగనున్నాయని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వేమూరు సీఐకి గాయాలు
కొల్లూరు: బందోబస్తు కోసం వెళుతున్న వేమూరు సీఐ కారు ప్రమాదానికి గురైన సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు.. వేమూరు సీఐగా విధులు నిర్వర్తిస్తున్న పసుపులేటి వీరాంజనేయులు కొల్లూరులో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి చుండూరు మండలంలో వైఎస్సార్ సీపీ వర్గీయుల గృహాలపై ఆ మండల టీడీపీ నాయుకులు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడి అలజడి సృష్టించారు. దాడుల సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు అదనపు బందోబస్తు నిమిత్తం వేమూరు సీఐని సంఘటనా ప్రాంతానికి వెళ్లాలని ఆదేశించారు. అర్ధరాత్రి సమయంలో సీఐ కారును స్వయంగా నడుపుకుంటూ బందోబస్తుకు పయనమయ్యారు. వేమూరు మండలం పెరవలిపాలెం గ్రామంలోని మలుపు వద్ద పొగమంచు కారణంగా రహదారి కనిపించకపోవడంతో రోడ్డు వెంబడి భవనం గోడను బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో కారు ధ్వంసమవడంతోపాటు, సీఐ వీరాంజనేయులు గాయాలబారిన పడి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన కారును గమనించిన స్థానికులు కొద్ది సమయానికి అదే మార్గంలో చుండూరు మండలం వెళుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు వాహనాన్ని ఆపి కారు ప్రమాదానికి గురై ఓ వ్యక్తి గాయాలకు గురయ్యాడని తెలియజేశారు. డీఎస్పీ తన సిబ్బందితో కలసి ప్రమాద స్థలంలో కారును పరిశీలించగా వేమూరు సీఐగా గుర్తించారు. వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న సీఐను గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ఎటువంటి ప్రమాదం లేదని వెల్లడించినట్లు సమాచారం.
బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు చేరిన ఆరు జట్లు
బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు చేరిన ఆరు జట్లు


