సమాజాన్ని మేల్కొలిపేవి నాటికలే..
యద్దనపూడి: నాటికల్లోని పాత్రల్లో ప్రేక్షకులు తామను తాము చూసుకోవటం ద్వారా సామాజిక చైతన్యం పెరుగుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండలంలోని అనంతవరం గ్రామంలో ప్రదర్శిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీల్లో భాగంగా చివరిరోజు ప్రదర్శించిన నాటిక పోటీలు ఆధ్యంతం ప్రేక్షకులను రంజింపచేశాయి. తొలుత మంత్రి జ్యోతి ప్రజ్వలన చేశారు. విశ్రాంత డీజీపీ ఎం. మాలకొండయ్య మాట్లాడుతూ భాషా ఉన్నతికి చిరునామాగా, సామాజిక హితాన్ని కాంక్షిస్తూ ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని వాస్తవ పరిస్థితులను తెలిపే నాటికలకు పూర్వవైభవం రావాలని ఆకాంక్షించారు. కళాపరిషత్‌ల ద్వారా నాటికల పోటీలు నిర్వహించి కళాకారులను అభినందిస్తూ గౌరవించటం అభినందనీయమని కొనియాడారు. ముఖ్యంగా సీ్త్రల ఔనత్యాన్ని ఇనుమడింపజేసేలా మంచి నాటకాలు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు గుదే పాండురంగారావు, తారక రామారావు, కొరిటాల వంశీకృష్ణ, ఈశ్వరప్రసాద్, పోపూరి హనుమంతరావు, సాంబశివరావు, రావి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన నాటిక పోటీలు..
న్యూస్టార్ మోడరన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియోషన్ వారి అఖండపర్వం, యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి ధర్మో రక్షతి, శ్రీకారం రోటరీ కళాపరిషత్ మార్టూరు వారి నాలుగుకాళ్ల మండపం నాటికలు ప్రేక్షకులను అలరించాయి.
అనంతవరంలో ముగిసిన నాటిక పోటీలు


