జాతీయ తైక్వాండో పోటీలకు చిన్నారుల ఎంపిక
చీరాల రూరల్/వేటపాలెం: జాతీయ స్థాయిలో నిర్వహించే తైక్వాండో పోటీలకు చీరాలకు చెందిన మల్లెల రంజయ్ లోచన్, మల్లెల నిక్షిప్త విజయ్‌లు ఎంపికయ్యారు. గతేడాది డిసెంబర్ 28న గుంటూరు జిల్లా తెనాలిలో ఏపీ తైక్వాండో అసోసియేషన్ నిర్వహించిన రెండో ఏపీ స్టేట్ కిడ్స్, ఫెడరేషన్ కప్‌లో చీరాలకు చెందిన చిన్నారి క్రీడాకారులు మల్లెల రంజయ్ లోచన్, మల్లెల నిక్షిప్త విజయ్‌లు పాల్గొని అత్యంత ప్రతిభ కనబరచారు. దీంతో సెలక్టర్లు వీరిరువురిని ఈ ఏడాది జనవరి 18 నుంచి 23 వరకు జైపూర్‌లో జరిగే ఇండియన్ తైక్వాండో మూడో కిడ్స్ చాంపియన్ షిప్–2026 జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జైపూర్‌కు పయనమైన వీరిని ఆదివారం ఏర్ డీఎస్పీ విజయ సారధి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ వరికూటి అమృతపాణిలు అభినందించారు. భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులుగా ఎదిగి దేశానికి పాతినిథ్యం వహించాలని వారు ఆకాంక్షించారు. క్రీడాకారులు జైపూర్ వెళ్లేందుకు డాక్టర్ అమృతపాణి కొంత ఆర్థిక సాయం అందించారు. కొత్తపేట బీఆర్‌కే హైస్కూల్‌లో 2,4 తరగతులు చదువుతున్న మల్లెల నిక్షిప్త విజయ్, మల్లెల రంజయ్ లోచన్ పోటీల్లో సబ్ జూనియర్స్ విభాగంలో ప్రతిభ కనబర్చి విజేతలగా నిలిచి గోల్డ్ మెడల్స్ సాధించారని స్కూలు కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ రాధాకృష్ణమూర్తి ఆదివారం తెలిపారు.
నేటి నుంచిి 23 వరకు జైపూర్‌లో జరిగే పోటీలకు పయనమైన రంజయ్ లోచన్, నిక్షిప్త విజయ్
చిన్నారులను అభిందించిన ఏఆర్ డీఎస్పీ విజయ సారధి, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు డాక్టర్ అమృతపాణి


