మంగళగిరిలో పవర్ లిఫ్టింగ్ సెలక్షన్ పోటీలు
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మంగళగిరి పట్టణంలోని ఫిట్‌జోన్ జిమ్‌లో సీనియర్ క్లాసిక్ మెన్ అండ్ ఉమెన్ పవర్‌లిఫ్టింగ్ టీమ్ సెలక్షన్ పోటీలు నిర్వహించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు విజయభాస్కరరావు, ప్రధాన కార్యదర్శి యస్‌కె. సంధాని తెలియజేశారు. వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఈ సెలక్షన్ పోటీల్లో గెలుపొందిన వారు ఫిబ్రవరి 14,15 తేదీల్లో రాజమండ్రిలో జరిగే 13వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్లాసిక్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. సెలక్షన్ పోటీల్లో మెన్ టీం నుంచి ప్రదీప్‌కుమార్, జస్వంత్, రాజు, దినేష్, మొహిద్దీన్, కౌషిక్, పృధ్వికుమార్‌లు, ఉమెన్ టీం నుంచి చంద్రిక, హర్షిత, చాతర్యలు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులను జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ వంశీకృష్ణ, సభ్యులు పవన్‌కుమార్, సందీప్ తదితరులు అభినందించారు.


