● వృద్ధురాలి మెడలో 27 గ్రాముల బంగారు గొలుసు చోరీ చేసిన
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా కె.మయూర్ అశోక్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి అందే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. గుంటూరు నగరంలో సుమారు 10 లక్షల మంది జనాభా ఉన్నారని, సీఆర్‌డీఏ పరిధిలో కీలక నగరంగా ఉందని, దానికి తగ్గట్టు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలని, అందుకు తగిన విధంగా నగర అభివృద్ధి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో కృషి చేస్తామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ తమీమ్‌అన్సారియా, ఎస్పీ వకుల్‌జిందాల్‌ల మర్యాదపూర్వకంగా కలిశారు.
నరసరావుపేట ఈస్ట్: జిల్లా పరిధిలో నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు హాజరైన విద్యార్థుల ధ్రువ పత్రాలను ఈనెల 20వ తేదీలోగా సిద్ధం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా పత్రాల ధ్రువీకరణ కోరుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ ప్రకటన కోసం www.bre.ap.gov.in వెబ్‌సైట్‌ను గమనిస్తుండాలని స్పష్టం చేశారు. పరీక్ష ఫలితాల ప్రక్రియలో భాగంగా విద్యార్థుల పత్రాల పరిశీలనకు జాబితా డీఈఓ కార్యాలయానికి త్వరలో వస్తుందన్నారు. అప్పటికి విద్యార్థుల హాల్‌టికెట్ జిరాక్స్ కాపీతో సహా కుల, ఆదాయ, 7వ తరగతి ఉత్తీర్ణత తదితర సర్టిఫికెట్లు అందుబాటులో ఉండాలన్నారు. లేని పక్షంలో విద్యార్థుల వివరాలు తుది జాబితా నుంచి తొలగించబడతాయని తెలిపారు. దీనికి తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ విద్యార్థులకు గ్రూప్–1 నుంచి గ్రూప్–3 వరకు ఏదో ఒక సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలని తెలిపారు. తుది జాబితా విడుదల చేసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థనలు అంగీకరించబడవని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సర్టిఫికెట్లను గడువు తేదీలోగా డీఈఓ కార్యాలయంలో అందచేయాలని కోరారు.
పెదకూరపాడు : సాయం చేసినట్లు చేసి వృద్ధురాలు మెడలోని 27 గ్రాముల బంగారం గొలుసుని లాక్కొని ద్విచక్ర వాహనదారుడు ఉడయించిన సంఘటన మండలంలోని పరస – ఖమ్మంపాడు గ్రామంపాడు గ్రామాల మధ్య శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని 75 త్యాళ్లూరు గ్రామానికి చెందిన 70 సంవత్సరాల ఈదా సామ్రాజ్యం పరస గ్రామంలో ఉంటున్న తన మనవడు అంజిరెడ్డి గృహానికి శనివారం ఉదయం వచ్చింది. అంజిరెడ్డి కంభంపాడు, జనాలపురం గ్రామాల మధ్య ఒక ఎకరం మిరప తోట సాగు చేస్తున్నాడు. సామ్రాజ్యం మధ్యాహ్న భోజనం ముగించుకొని తన మనవడు మిరప పొలాన్ని చూసేందుకు బయలుదేరారు. పరస జంక్షన్ వద్ద మిరప పొలానికి వెళ్లేందుకు నిలిచి ఉండగా కంభంపాడు గ్రామం వైపు వెళుతున్న యువకుడి ద్విచక్ర వాహనాన్ని లిఫ్ట్ అడిగింది. వాహనదారుడు వృద్ధురాలను ఎక్కించుకొని మార్గమధ్యంలో ఆమె మెడలో ఉన్న 27 గ్రాముల బంగారం గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. వెంటనే వృద్ధురాలు సామ్రాజ్యం తన మనవడు అంజిరెడ్డికి సమాచారం ఇచ్చి పెదకూరపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ సంఘటన స్థలానికి చేరుకొని వృద్ధురాలు వద్ద వివరాలు సేకరించి, దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించారు.
● వృద్ధురాలి మెడలో 27 గ్రాముల బంగారు గొలుసు చోరీ చేసిన


