ఎన్టీఆర్ కళాపరిషత్ నాటకోత్సవాలు ప్రారంభం
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): స్థానిక బృందావన్‌గార్డెన్స్‌నన్‌వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళా వేదికపై మూడు రోజులపాటు జరగనున్న ఎన్టీఆర్ కళాపరిషత్ 21వ నాటకోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. కేఆర్‌కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు సంస్థ ఉపాధ్యక్షుడు వేములపల్లి విఠల్ అధ్యక్షత వహించారు. విజ్ఞాన్ విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్యను ఎన్టీఆర్ ఆత్మీయ పురస్కారంతో సత్కరించారు. అనంతరం కళాంజలి (హైదరాబాద్) ఆధ్వర్యంలో శ్రీశైలమూర్తి రచనకు కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించిన యాగం నాటకం ప్రదర్శించారు. దేశభక్తిని నాటకంలో చాటారు. కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, సంస్థ అధ్యక్షుడు ఘంటా పున్నారావు, గౌరవాధ్యక్షుడు అంబటి మధుమోహన్‌కృష్ణ, డాక్టర్ కాసరనేని సదాశివరావు కళాసమితి సభ్యుడు యర్రా ఈశ్వరరావు, ఎల్‌వీఆర్ సన్స్ క్లబ్ అధ్యక్షుడు నూకవరపు వెంకటేశ్వరరావు, పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు కేతేపల్లి సాంబశివరావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమా మహేశ్వరరావు, సంస్థ నిర్వాహకులు రామకృష్ణప్రసాద్ కాట్రగడ్డ, బొప్పన నరసింహారావు (బుజ్జి), జి.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ కళాపరిషత్ నాటకోత్సవాలు ప్రారంభం


