మహిళలు, చిన్నారుల రక్షణ భద్రతే లక్ష్యంగా శక్తి బృందాలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : జిల్లాలోని మహిళలు, చిన్నారుల రక్షణ, భద్రతే లక్ష్యంగా శక్తి బృందాలు పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బృందాల ద్వారా క్షేత్రస్థాయిలో జిల్లా అంతటా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. గత మూడు నెలల్లో పాఠశాలలు, కళాశాల లు, ముఖ్యమైన కూడళ్లల్లో సుమారు 99 అవగాహన సదస్సులు నిర్వహించి, 2 వేల మందికి అవగాహన కల్పించామని అన్నారు. శక్తి యాప్‌లను 821 మంది మొబైల్‌ఫోన్లల్లో ఇన్‌న్‌స్టాల్ చేసుకున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది శక్తి బృందాలు ఉన్నాయని, ప్రతి పోలీస్ సబ్ డివిజనన్‌్ కు ఒకటి చొప్పున నెలకొల్పామని అన్నారు. గుంటూరు నగరంలో రెండు బృందాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన నగర నూతన కమిషనర్
గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను శనివారం గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన కె.మయూర్ అశోక్ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ప్రజలకు ఉత్తమమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు.
నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన పీజీఆర్‌ఎస్ (గ్రీవెన్స్), మీడియా సెల్ నూతన భవనాన్ని శనివారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, పీజీఆర్‌ఎస్ సీఐ బిలాలుద్దీన్, వెల్ఫేర్ ఆర్‌ఐ సురేష్, ఎంటీ ఆర్‌ఐ శ్రీహరిరెడ్డి జిల్లా ఎస్పీ వెంట ఉన్నారు.
మూడు నెలల్లో 99 అవగాహన సదస్సులు.. రెండు వేల మందికి అవగాహన


