మందా సాల్మన్‌ది ప్రభుత్వ హత్యే
న్యూస్‌రీల్
గోగులమ్మ వారి విశేష దర్శనం
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
సాగర్ నీటిమట్టం
గుంటూరు
● పాలకులపై వైఎస్సార్ సీపీ నేతల
మండిపాటు
● చంద్రబాబు సర్కార్ వైఖరికి
నిరసనగా ప్రదర్శన
7
ఆదివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2026
బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న వనమా బాలవజ్రబాబు, అంబటి మురళీకృష్ణ, ఎస్సీ విభాగ నేతలు
గుంటూరులో నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నాయకులు
ర్యాలీగా వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నాయకులు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై మారణహోమం కొనసాగుతూనే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తొలి నుంచి దళితులంటే చిన్న చూపేనని.. నిండు ప్రాణాలను బలిగొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్‌ను కూకటి వేళ్లతో పెకిలిస్తామని హెచ్చరించారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో టీడీపీ నేతలు మందా సాల్మన్‌ను హత్య చేయడంతో నిరసన కార్యక్రమం వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గెడ్డేటి సురేంద్ర ఆధ్వర్యంలో జరిగింది. లాడ్జి సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి ముందుగా బాబూ జగ్జీవన్ రాం విగ్రహం వరకు నిరసన పదర్శన సాగింది. అనంతరం అక్కడ బైఠాయించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
భట్టిప్రోలు: పెదపులివర్రు గ్రామ దేవత శ్రీ గోగులమ్మ అమ్మవారు శనివారం మూలానక్షత్రం సందర్భంగా 27 నక్షత్రాల ప్రతీకగా నక్షత్ర దీప సౌందర్య కాంతుల అలంకారంతో విశేష దర్శనమిచ్చారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 38.3148 టీఎంసీలు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 553.30 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 33,138 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
మందా సాల్మన్‌ది ప్రభుత్వ హత్యే
మందా సాల్మన్‌ది ప్రభుత్వ హత్యే
మందా సాల్మన్‌ది ప్రభుత్వ హత్యే
మందా సాల్మన్‌ది ప్రభుత్వ హత్యే
మందా సాల్మన్‌ది ప్రభుత్వ హత్యే
మందా సాల్మన్‌ది ప్రభుత్వ హత్యే
మందా సాల్మన్‌ది ప్రభుత్వ హత్యే


