భూములు ఇచ్చేందుకు సిద్ధమే
అభివృద్ధికి మేం పూర్తిగా సహకరిస్తాం. మా వాళ్లు చాలా మంది అమరావతి రాజధాని కోసం భూములిచ్చారు. వారిలో ఇప్పటికీ కొందరికి ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వలేదు. ఓఆర్‌ఆర్‌కు భూమిలిచ్చేందుకు సిద్ధం. కానీ సుమారు రూ.2 కోట్లకు పైగా విలువ ఉన్న భూములకు కేవలం రూ.30 లక్షలు ఇస్తామంటున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నాకున్న భూమిలో మిర్చి, పత్తి పండిస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నాను. భూములు కోల్పోతే మా పరిస్థితి ఏంటో తెలీడంలేదు.
– అనిల్ కుమార్,
రైతు, డోకిపర్రు


