ఆడపిల్లలకు కట్నం కింద ఇచ్చామయ్యా...
నాకు మొత్తం 2 ఎరాలు ఉంది. ఇటీవల ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసి చెరో అర ఎకరం ఇచ్చాం. మిగిలిన నా పొలంతోపాటు ఆడపిల్లలకిచ్చిన పొలాలు కూడా ఓఆర్‌ఆర్ కింద తీసుకుంటారంట. ఇలా అయితే వాళ్ళ సంసారాలు ఏం కావాలి. అల్లుళ్లు ప్రశ్నించరా. ప్రభుత్వం ఇస్తామన్న పరిహారం కూడా చాలా తక్కువంటున్నారు. నాలుగు రోజల నుంచి మనస్సు ఏమీ బాగుండడం లేదయ్యా. నాకు 70 సంవత్సరాల వయస్సు. అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం ఇలా మోసం చేస్తుందనుకోలేదు.
– ఎన్.సరస్వతి, డోకిపర్రు


