సచ్చిదానంద ఆశ్రమంలో సంక్రాంతి వేడుకలు
తెనాలి రూరల్: మండలంలోని పెదరావూరు గ్రామంలో గల శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండుగ రోజైన గురువారం శ్రీ గణపతి సచ్చిదానంద స్వాజీ ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం సూర్య హోమం, యజుర్వేద పారాయణం, చక్ర పూజ, ధాన్యలక్ష్మి పూజ, లక్ష రుద్రాక్ష అర్చన, కూష్మాండ దానం, మహా హారతి నిర్వహించారు. సాయంత్రం దివ్య నామ సంకీర్తన కార్యక్రమాన్ని భక్తిఽశ్రద్ధలతో జరిపించారు. శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా నారాయణ హోమం, యజుర్వేద పారాయణం, శ్రీనివాస కళ్యాణం, దివ్య నామ సంక్త్రీన, మంంగళ హారతి వైభవంగా నిర్వహించారు. పండుగ వేడుకల సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణ చేశారు.
బంగారం చోరీ కేసులో అరెస్ట్
కేజీఎఫ్ : కర్ణాటకలోని కోలారు జిల్లా బంగారుపేట పట్టణంలోని నగల దుకాణంలో 2025 ఆగస్టు 4న జరిగిన దోపిడీ కేసును బంగారుపేట పోలీసులు ఛేదించారు. నిందితుడిని ఏపీలోని గుంటూరు జిల్లా కొరిటెపాడు, చైతన్యపుర నివాసి రాయపాటి వెంకన్న (49)గా గుర్తించారు. ఇతను పలమనేరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఒక కేసులో చిత్తూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నట్లు తెలుసుకొని బంగారుపేట పోలీసులు వెళ్లి అతన్ని బాడీ వారెంట్‌పై కోలారుకు తీసుకువచ్చి విచారణ చేపట్టారు. అతను ఇచ్చిన సమాచారంతో రూ. 1.05 కోట్ల విలువైన 879 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య
తెనాలిరూరల్: రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలిలో శుక్రవారం జరిగింది. మండలంలోని సోమసుందరపాలెం గ్రామానికి చెందిన మల్లోలు ఏడుకొండలు(65) తెనాలిలోని యడ్లలింగయ్య కాలనీ రైల్వే గేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని తెనాలి వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎల్.సరస్వతి తెలిపారు.
నరసరావుపేట: పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో ప్రముఖ సాహితీవేత్త, మహిళా పక్షపాతి త్రిపురనేని రామస్వామి చౌదరికి ఘనంగా నివాళులు అర్పించారు. త్రిపురనేని జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆదేశాల మేరకు రెవెన్యూ, పర్యాటక శాఖల ఉద్యోగులు ఆయన చిత్రపటానికి పూలు చల్లి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రామస్వామి సాహిత్యాలు, స్వాతంత్య్ర ఉద్యమం మీద ప్రభావం, మహిళల పట్ల గౌరవభావం, కుల వివక్ష, అంటరానితనం, అందవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన ఉద్యమాలు, చేసిన పోరాటాల గురించి తలుచుకున్నారు.
చెరుకుపల్లి: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొని ఓ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం చందోలు నుంచి పిట్లవానిపాలెం వెళ్లే రహదారిలో రాంబొట్ల పాలెం పంచాయతీ పరిధిలో గురువారం ఒంటి గంట సమయంలో నిజాంపట్నం గ్రామానికి చెందిన ఏమినేని రామకృష్ణ(42) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై నిజాంపట్నం వెళుతుండగా అదే మార్గంలో చందోలు గ్రామానికి చెందిన కంకణాల శ్రీను అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ఎదురుగా వచ్చి రామకృష్ణ వాహనాన్ని ఢీ కొనటంతో తీవ్ర గాయాలైన రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై టి.అనిల్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రేపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
సచ్చిదానంద ఆశ్రమంలో సంక్రాంతి వేడుకలు
సచ్చిదానంద ఆశ్రమంలో సంక్రాంతి వేడుకలు
సచ్చిదానంద ఆశ్రమంలో సంక్రాంతి వేడుకలు


