కొత్త అల్లుడికి ‘సంక్రాంతి’ మర్యాద
ప్రత్తిపాడు: తెలుగు సంస్కృతిలో కొత్త అల్లుళ్లకు సంక్రాంతి పండుగకు ఉన్న అనుబంధం విడదీయలేనిది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అల్లుడికి ఘనమైన మర్యాదలు చేస్తుంటారు. ఇప్పుడు ఆ సంప్రదాయం గుంటూరు జిల్లాలోనూ కనిపించింది. ప్రత్తిపాడుకు చెందిన అరవపల్లి నాగేశ్వరరావు రేణుక దంపతులు తమ కుమార్తె సరయును రెండు నెలల కిందట పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ప్రణీత్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహానంతరం అల్లుడు ప్రణీత్ తమ ఇంటికి తొలి సంక్రాంతికి వచ్చిన నేపథ్యంలో మరిచిపోలేని విందు ఇచ్చారు. ఏకంగా 75 రకాలకు కు పైగా సంప్రదాయ వంటకాలతో అల్లుడిని ముంచెత్తారు. సరయు తల్లి రేణుక గోదావరి జిల్లాకు చెందిన మహిళ కావడంతో తన అల్లుడికి తమ ప్రాంతం మర్యాద చేశారు.


