తాడికొండలో ‘బరి’ తెగించారు..!
తాడికొండ: సంక్రాంతి పండుగ మాటున తాడికొండ మండలంలో పందేల బరులు కొనసాగాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లో మండల పరిధిలోని నిడుముక్కల గ్రామంలో కత్తులు కట్టి కోడి పందేలు నిర్వహించడంతో పాటు పేకాట, గుండాట యథేచ్ఛగా కొనసాగింది. మోతడకలో జోరుగా కోడి పందేలు వేయడంతో పండుగ మాటున మూగజీవాలు హింసకు గురై మృత్యువాత పడ్డాయి. నియంత్రించాల్సిన పోలీసు అధికారులు అటువైపు తొంగిచూసిన దాఖలాలు లేకపోవడంతో నిర్వాహకులు పందేల మాటున జోరుగా జేబులు నింపుకొన్నారు. అధికార పార్టీ కావడంతో అదుపుచేసే పరిస్థితి లేకపోయిందని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కోడి పందేల రాయుళ్లు భారీగా హజరు కావడంతో ఆ ప్రాంతం కోలాహాలంగా మారింది.
తాడికొండలో ‘బరి’ తెగించారు..!


