వెంకటపాలెం వెస్ట్ బైపాస్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం
తుళ్ళూరు ఎస్సీ కాలనీకి చెందిన ఇద్దరు మృతి
తాడికొండ: తుళ్ళూరు మండలం వెంకటపాలెం వద్ద పశ్చిమ బైపాస్ బ్రిడ్జిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తుళ్లూరు ఎస్సీ కాలనీకి చెందిన బుద్దా మార్క్ (50), పౌలు (65) లు మరణించారు. ద్విచక్ర వాహనంపై తుళ్లూరు మండలం వెంకటపాలెం పశ్చిమ బైపాస్ మీదుగా గొల్లపూడి వైపు వెళుతుండగా రాంగ్ రూట్‌లో వెళ్లి లారీని ఢీకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మంగళగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మార్క్‌కు కుమార్తె, కుమారుడు ఉండగా, పౌలు విశ్రాంత ఉద్యోగి అని వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారని స్థానికులు తెలిపారు.


