దివ్యాంగులు అన్నిరంగాల్లో పోటీపడాలి
గుంటూరు వెస్ట్: దివ్యాంగులు అన్ని రంగాల్లోనూ పోటీపడాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆరుగురు దివ్యాంగులకు ల్యాప్‌ట్యాప్‌లు బహూకరించారు. ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ సువార్త పాల్గొన్నారు.
ఇద్దరికి కారుణ్య నియామకపత్రాలు..
ఇద్దరికి ఆయా శాఖల్లో జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో తాడిశెట్టి ఎస్‌ఎస్‌కే కుమార్‌కు పోలీసు శాఖలోనూ, బుళ్ల శృతికి రెవెన్యూ శాఖలో ఉద్యోగ నియామక ఉత్తర్వులను ఇన్‌చార్జి కలెక్టర్ అందజేశారు.
కాలుష్య నియంత్రణ సామాజిక బాధ్యత
గుంటూరు వెస్ట్: కాలుష్య నియంత్రణను సామాజిక బాధ్యతగా గుర్తించాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోస్టర్లు, గుడ్డ సంచులను ఆవిష్కరించారు.


