ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందికి సత్కారం
నగరంపాలెం: ఉద్యోగ విరమణ పొంది ప్రతిఒక్కరూ తమ భావి జీవితాన్ని సుఖసంతోషాలతో జీవించాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. ఎస్‌ఐలు రంగారావు (అరండల్‌పేట పీఎస్) పి.నాగేశ్వరరావు (చేబ్రోలు పీఎస్), బి.వెంకటేశ్వరరావు (ఏఆర్), ఏఎస్‌ఐ ఎంవీ.కృష్ణారావు (పట్టాభిపురం పీఎస్), హెడ్ కానిస్టేబుల్ సీహెచ్.కృష్ణారావు (పట్టాభిపురం పీఎస్), జి.నాగేశ్వర రావు (తాడికొండ పీఎస్),షేక్ మహమ్మద్‌షరీఫ్ (డీపీఓ సీనియర్ సహాయకుడు)లు ఉద్యోగ విరమణ పొందారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో వారిని సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలరెడ్డి గారు, ఎస్‌బీ సీఐ అళహరి శ్రీనివాస్, ఆర్‌ఐలు శివరామకృష్ణ, జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మైలా సాంబశివరావు, కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి హుస్సేన్ పాల్గొన్నారు.


